News January 13, 2025
కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతోపాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు, GHMC కమిషనర్కు అప్పగించింది. MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. కార్డుల్లో మార్పులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తారు.
Similar News
News November 12, 2025
నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.
News November 12, 2025
ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

భారత్లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్లో ఉంది.
News November 12, 2025
కొత్త వాహనాలు కొంటున్నారా?

APలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి వారంలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నంబర్ రాకపోతే ఆటోమేటిక్గా కేటాయింపు జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం శాశ్వత నంబర్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.500-1000 ఇస్తేనే నంబర్ ఇస్తామని వాహన డీలర్లు బేరాలాడుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ఇకపై వీటికి చెక్ పడనుంది.


