News April 7, 2025

BREAKING: గుజరాత్ ఘన విజయం

image

IPL2025: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH 152/8 స్కోర్ చేయగా, GT 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సుదర్శన్ 5, గిల్ 61*, బట్లర్ 0, సుందర్ 49, రూథర్‌ఫర్డ్ 35* పరుగులు చేశారు. షమీ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. అన్ని విభాగాల్లోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.

Similar News

News January 5, 2026

ఎన్ని నీళ్లు వాడుకున్నా అడ్డు చెప్పలేదు: సీఎం చంద్రబాబు

image

AP: తెలంగాణతో నీటి వివాదాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఫర్వాలేదు మనకూ నీళ్లు వస్తాయని ఊరుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం. నీటి విషయంలోగానీ సహకారంలోగానీ తెలుగు వారంతా కలిసే ఉండాలి’ అని తెలుగు మహా సభల సందర్భంగా పిలుపునిచ్చారు.

News January 5, 2026

ప్రీ టర్మ్ బర్త్‌ను నివారించాలంటే?

image

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

News January 5, 2026

పోలవరం-నల్లమల సాగర్.. విచారణ వాయిదా

image

SCలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. కేటాయింపులకు విరుద్ధంగా AP నీళ్లను వాడుకుంటోందని TG వాదించింది. అయితే ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్రం అనుమతి తీసుకున్నామని AP తెలిపింది. TG గోదావరిపై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాదించింది. పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని SC వ్యాఖ్యానించింది.