News March 22, 2025
BREAKING: కాసేపట్లో భారీ వర్షం

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 11 గంటల వరకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
Similar News
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.


