News March 29, 2024
BREAKING: టీడీపీలో చేరిన హీరో నిఖిల్

AP: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఈ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.
Similar News
News December 27, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మళ్లీ మార్పులు.!

ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అభ్యంతరాలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పొదిలిని ప్రకాశం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో కలిపే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News December 27, 2025
CBN ప్రభుత్వమని గుర్తుంచుకోండి: అనిత

AP: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు. జంతుబలులు చేసి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది CBN ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేతలు చేసేది తప్పని చెప్పలేరా అని మండిపడ్డారు. ఆస్తి కోసం తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టించిన వ్యక్తి మీ పిల్లల్ని రక్షిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.


