News September 13, 2024

‘హైడ్రా’పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. GHMC యాక్ట్‌ను కాదని, హైడ్రాకు అధికారాల బదిలీ ఎలా చేస్తారని పిటిషనర్‌ ప్రశ్నించారు. కాగా HYDలోని చెరువుల FTL, బఫర్ జోన్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తోంది.

Similar News

News November 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 17, 2025

భారత్‌పై పాకిస్థాన్ విజయం

image

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో ఇండియా-Aపై పాకిస్థాన్-A విజయం సాధించింది. IND-A నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశారు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ <<18306948>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం గమనార్హం.