News March 31, 2025
BREAKING: రేపు సెలవు ప్రకటన

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.
Similar News
News January 12, 2026
చర్మాన్ని ఇలా హైడ్రేట్ చెయ్యండి..

కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. వయసు పైబడటం, ఎండ వేడికి చర్మం పాడవడం వల్ల చర్మ కణాల్లో నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి చర్మానికి హైడ్రేటర్లను అందించాలి. మాయిశ్చరైజర్లతో పోలిస్తే హైడ్రేటర్లు కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆసిడ్ వంటివి హైడ్రేటర్లు. వాటిని తప్పక వాడాలి. వీటితో పాటు వారానికి రెండుసార్లు స్క్రబింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
News January 12, 2026
కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోల్ ఇండియా లిమిటెడ్(<
News January 12, 2026
పనసలో కాయకుళ్లు తెగులు లక్షణాలు

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.


