News January 15, 2025

BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట

image

AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.

Similar News

News December 16, 2025

నేడే ‘విజయ్ దివస్’.. ఎందుకు జరుపుకుంటారు?

image

DEC 16, 1971. ఇది పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. PAK సైన్యాధిపతి AAK నియాజీ 93వేల మంది సైనికులతో ఢాకాలో భారత్‌కు లొంగిపోతారు. పాక్ ఓడిపోయి తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర ‘బంగ్లాదేశ్‌’గా ఏర్పడింది. ఈ విజయానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ జరుపుకుంటున్నాం. 1971లో తూర్పు పాకిస్తాన్‌లో పాక్ ఆధిపత్యం, ఆంక్షలతో మొదలైన స్వతంత్ర పోరు క్రమంగా భారత్-పాక్ యుద్ధానికి దారితీసింది.

News December 16, 2025

గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరం: శశిథరూర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ (గ్రామీణ్)’ (VBGRAMG) అని పేర్కొంది. అయితే దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరమని, మహాత్ముడిని అగౌరవపరచొద్దని కాంగ్రెస్ MP శశి థరూర్ కోరారు.

News December 16, 2025

డిసెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం
* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం
* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం
* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు
* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం)