News January 28, 2025

BREAKING: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

image

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాది మణీంద్రసింగ్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసును వాదించడానికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించింది.

Similar News

News January 20, 2026

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్‌ కురియన్‌తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌పై చర్చించారు.

News January 20, 2026

రేపే తొలి T20.. IND ప్లేయింగ్ 11 ఇదేనా?

image

IND రేపు NZతో నాగ్‌పూర్ వేదికగా తొలి T20 ఆడనుంది. ఇప్పటికే నం.3లో ఇషాన్ కిషన్ ఫిక్స్ కాగా ప్లేయింగ్ 11 ఇదేనంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను Xలో పంచుకుంటున్నారు. త్వరలోనే T20 WC ఉండటంతో పెద్దగా ప్రయోగాలు చేయకుండా తొలి మ్యాచ్ ఆడే జట్టునే సిరీస్ మొత్తం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. టీమ్: అభిషేక్, శాంసన్, కిషన్, సూర్య, హార్దిక్, దూబె, అక్షర్, రింకూ, కుల్దీప్/వరుణ్, అర్ష్‌దీప్, బుమ్రా.

News January 20, 2026

తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

image

దావోస్‌ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.