News November 18, 2024
BREAKING.. HYDలో ఐటీ సోదాలు

HYDలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి షాద్‌నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్‌లోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షాద్‌నగర్‌లో భూవిక్రయం జరిపిన స్వస్తిక్ కంపెనీ.. బ్యాలన్స్ షీట్‌లో వివరాలు చూపకపోవడంతో ఈ ఐటీ సోదాలకు దారి తీసింది. ఇందులో రూ.300కోట్ల వరకు భూ విక్రయం జరిగినట్లు గుర్తించారు.
Similar News
News March 9, 2026
రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.
News March 9, 2026
నగరంలో పెరుగుతున్న భగభగలు

నగరంలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే వేడి, మార్చి మొదటి వారంలోనే సెగలు పుట్టిస్తోంది. ఆదివారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కాగా.. రానున్న వారం రోజుల్లో 40 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
News March 7, 2026
రంగారెడ్డి: బాలికలకు రేపు HPV

బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన HPV టీకా కార్యక్రమ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఈ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలిత దేవి తెలిపారు. అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


