News August 11, 2024

BREAKING.. HYDలో గొంతు కోసి హత్యాయత్నం

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోరబండ పీఎస్ పరిధి కార్మికనగర్‌లోని NI-MSME గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు దాడి చేసి, అతడి గొంతుకోసి హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 11, 2024

హైదరాబాద్: మందు తాగితే నో ఎంట్రీ!

image

HYDలో గణేశ్‌ నిమజ్జనాలు‌ మొదలయ్యాయి. బుధవారం 5వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు సాయంత్రం భారీ జులూస్‌ నడుమ ‌ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్ ప్లాజా ఎదుట క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం, మరేదైనా మత్తు పదార్థాలు తాగిన వ్యక్తులను అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలన్నారు.
SHARE IT

News September 11, 2024

HYDలో 40 గంటల భారీ బందోబస్తు!

image

HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.

News September 11, 2024

HYD: శ్రీమహా విష్ణువుతో వినాయకుడి పాచికలు

image

సికింద్రాబాద్(లష్కర్)లో వివిధ రకాల గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలాసిగూడలో శ్రీలక్ష్మీ గణపతి అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేశుడు వెరైటీగా ఉండి, భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువుతో కూర్చొని పాచికలు ఆడుతున్నట్లుగా ఏర్పాటు చేసిన విగ్రహాల సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. 108 రకాల స్వీట్లను తయారు చేసి, గణేశుడికి నైవేద్యంగా పెట్టారు.