News August 18, 2024
BREAKING: HYDలో భారీ వర్షం

HYDలో భారీ వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డినగర్, బాలాపూర్, అల్మాస్‌గూడ, నాదర్‌గుల్, మీర్‌పేట్, బడంగ్‌పేట్ తదితర ప్రాంతాల్లో సుమారు అర గంట నుంచి భారీ వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి.
Similar News
News December 20, 2025
22వ తేదీ నుంచి యథావిధిగా ప్రజావాణి: నారాయణ రెడ్డి

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈనెల 22 నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులతో హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.
News December 19, 2025
BREAKING: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో సరూర్‌నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి కేసులో పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాలిక భర్త, తండ్రికి రూ. 75వేల జరిమానా న్యాయమూర్తి వేశారు. బాధితురాలికి రూ.15లక్షల పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేశారు.
News December 18, 2025
శంకర్‌పల్లి: ప్రజలారా డబ్బులు వెనక్కివ్వలేదో… స్టేటస్ పెట్టేస్తా

శంకర్పల్లి మం.లోని ఓ గ్రామ సర్పంచి స్థానానికి పోటీచేసి ఓడిన అభ్యర్థి ఒకరు తనకు ఓటు వేయనివారు తానుపంచిన డబ్బును రిటన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే డబ్బులు తీసుకున్నవారి పేర్ల జాబితాను ఐదేళ్లపాటు రోజూ వాట్సప్ స్టేటస్ లో పెడతానని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు. డబ్బులు వెనక్కి పంపినవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ స్టేటస్‌కు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందంటూ ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు.


