News May 12, 2024

BREAKING: HYDలో స్టూడెంట్ SUICIDE

image

HYD ఘట్‌కేసర్ PS పరిధి ఘనపూర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒకేషనల్ కోర్సు అయిన MPHWలో మార్కులు తక్కువ వచ్చాయని మానసిక వేదనతో కాసర్ల స్వప్న‌(20) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తండ్రి సతీశ్ 2009లో ఘనపూర్‌లోని హ్యాపీ ఆర్ఫన్ హోంలో చేర్పించాడు. 1000కి 700 మార్కులే వచ్చాయని ఆమె సూసైడ్ చేసుకుంది. కేసు నమోదైంది.

Similar News

News November 27, 2024

HYD: ఎన్యుమరేటర్లకు సహకరించాలి: వేం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వే అధికారులు, ఎన్యుమరేటర్లు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన సర్వేలో కుటుంబ వివరాలు తెలిపారు. అధికారులకు ప్రతి కుటుంబం సహకరించాలని తెలిపారు. ఈ సర్వే ప్రతి కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలకు ప్రణాళిక వేయటానికి ఉపయోగపడుతుందని వేం నరేందర్ రెడ్డి అన్నారు.

News November 27, 2024

HYD: ఫిబ్రవరిలో 300 మందితో బర్డ్ సర్వే

image

వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.

News November 27, 2024

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు

image

HYDలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం <<14722224>>జీడిమెట్ల<<>>లోని కంపెనీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చల్లారకముందే <<14721016>>మణికొండ<<>>, <<14721091>>రామంతాపూర్‌<<>>లో‌ రెండు సంఘటలు వెలుగుచూశాయి. 2024లో ఇప్పటివరకు HYD, MM, RRలో 1550కి పైగా ప్రమాదాలు జరగడం ఆందోళనకరం. ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.