News January 3, 2025
BREAKING: HYD: ఉప్పల్‌లో టీచర్‌పై కేసు నమోదు..!

ఓ స్కూల్లో పిల్లాడిని కొట్టాడని టీచర్‌పై తల్లిదండ్రులు కేసు పెట్టిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ గణేశ్‌నగర్‌లోని కాకతీయ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బబ్లూ దాస్ జామెట్రీ బాక్స్ తేలేదని, హోంవర్క్ చేయలేదని మ్యాథ్స్ సబ్జెక్టు టీచర్ ఘనశ్యామ్ విద్యార్థి భుజంపై కొట్టాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 3, 2025
MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే విషయం ఖరారైంది. సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం పేరిణి నృత్యం, రాత్రి కొమ్ము కోయ డాన్స్, కీరవాణి సంగీత కార్యక్రమం, రెండో రోజు(మంగళవారం) ఉదయం వీణ వాయిద్యం, రాత్రి గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో, గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతం ఉండనుంది.


