News August 23, 2024
BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
క్యాబినెట్ మొత్తం జూబ్లిహిల్స్‌లోనే తిష్ట

ఇపుడు జరుగుతున్న ఉపఎన్నిక కేవలం ఒకే నియోజకవర్గంలో.. అయినా ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మొత్తం క్యాబినెట్ మంత్రులందరినీ అధిష్ఠానం రంగంలోకి దించింది. మంత్రులను బాధ్యులుగా చేశారు. క్యాబినెట్ మొత్తం జూబ్లీహిల్స్‌ను జల్లెడపడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ‘అమ్మా, అన్నా, అక్కా’ అంటూ మద్దతు కోరుతున్నారు. వీరితోపాటు నేరుగా సీఎం కూడా రంగంలోకి దిగారు.
News November 4, 2025
బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.


