News September 30, 2024

BREAKING: HYD: కాసేపట్లో DSC ఫలితాలు విడుదల

image

DSC ఫలితాలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 నెలల క్రితం పూర్తయిన DSC పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాగా, 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News November 3, 2025

HYD: మృతులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి

image

చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ప్రకటిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే CM రేవంత్ రెడ్డి స్పందించి మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.

News November 3, 2025

మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.

News November 3, 2025

పిల్లలను అనాథలుగా మార్చిన మీర్జాగూడ ప్రమాదం

image

మీర్జాగూడ ప్రమాదం ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బందప్ప-లక్ష్మి దంపతులు. వీరికి భవానీ, శివాలీ(ఆడబిడ్డలు) సంతానం. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. అమ్మ-నాన్నను కోల్పోయిన పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోయింది. చేవెళ్ల ఆస్పత్రి ఆవరణలో పిల్లల కన్నీరు అందరినీ కలచివేసింది.