News February 11, 2025
BREAKING: HYD: కూకట్పల్లిలో భార్యను చంపిన భర్త

HYD కూకట్పల్లిలో PS పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్న అబ్దుల్ రహీం అనే వ్యక్తి తన భార్య నసీమా బేగంను బండ రాయితో మోది దారుణంగా చంపేశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్బాగ్లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.
News November 1, 2025
జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఇప్పటి వరకు 15 కేసులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్, BRS, BJP నాయకులు తమ ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలపై నిఘా వేసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.
News November 1, 2025
HYD: సన్న బియ్యం సిద్ధం.. రేషన్ షాపులకు వెళ్లండి..!

నగర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 653 రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 17,102 టన్నుల సన్న బియ్యం నవంబరులో పంపిణీ చేయనున్నట్లు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. 30,42,056 మంది లబ్ధిపొందుతారని వివరించారు. 8,500 టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో మొదటి విడతగా సిద్ధంగా ఉన్నాయన్నారు.


