News October 5, 2024
BREAKING: HYD: ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ SUSPEND

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.
News November 14, 2025
BRS కంచుకోటను బద్దలు కొట్టిన న‘విన్’

హైదరాబాద్ అంటే BRS.. BRS అంటే హైదరాబాద్ అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ, జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్ విజయంతో గులాబీ కంచుకోట బీటలువారింది. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనాలను మించి నవీన్ యాదవ్ భారీ మెజార్టీని సాధించారు. ఏ ఒక్క రౌండ్‌లో BRS ఆధిక్యం చూపలేకపోయింది. సిటీలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడం విశేషం. న‘విన్’తో రాజధానిలో హస్తానికి మరింత బలం పెరిగింది.
News November 14, 2025
HYD: BRSకు కలిసిరాని సింపతి!

జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ సింపతిని నమ్ముకున్న BRSకు కలిసిరాలేదు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో లాస్య నివేదితను నిలబెట్టారు. అక్కడ కూడా సానుభూతి ఓట్లు రాల్చలేదు. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గోపినాథ్ మృతితో అనివార్యమైన జూబ్లీహిల్స్‌లో BRS అధిష్ఠానం ఆ కుటుంబానికే టికెట్ కేటాయించింది. ఇక్కడ మెజార్టీ ప్రజలు సింపతిని ఆదరించలేదు. దీంతో సునీత ఓటమి చవిచూశారు.


