News October 8, 2024
BREAKING: HYD: నిద్రిస్తున్న భార్య.. దారుణ హత్య!

HYD హైదర్షాకోట్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి భర్త శ్రీనివాస్ హత్య చేశాడు. గతకొంత కాలంగా టార్చర్ చేస్తున్నాడని గతంలోనే మృతురాలు పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో భార్యను చంపేసిన శ్రీనివాస్ పిల్లలతో సహా PSకి వెళ్లి లొంగిపోయాడు. స్పాట్‌కి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ. 5.91 కోట్ల దుబారా!

NOVలో జరిగిన జూబ్లీ బైపోల్ నిర్వహణకు రూ.5.91 కోట్లు ఖర్చు చేసినట్లు RTI ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిపై FGG అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త సిబ్బంది, వాహనాలు, పారామిలటరీ బలగాలు లేకుండా ప్రశాంతమైన జూబ్లీహిల్స్‌లో ఇంత భారీ ఖర్చు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా జరిగిందని, వెంటనే ఖర్చుపై ఆడిట్ నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని FGG ECకి విజ్ఞప్తి చేసింది.
News December 5, 2025
సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

సికింద్రాబాద్‌లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 5, 2025
HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

మా ప్రాంతాలను గ్రేటర్లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్‌పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.


