News August 14, 2024

BREAKING.. HYD: బాలిక కిడ్నాప్.. రంగంలోకి స్పెషల్ టీమ్

image

రాయదుర్గం పీఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్‌కు గురైంది. స్కూల్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంబడే ప్రత్యేక టీమ్ గాలింపు చేపట్టింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలికను పోలీసులు గంటలో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

HYD వాసులకు హెచ్చరిక.. డేంజర్‌లో పడుతున్నారు!

image

HYD వాసులకు హెచ్చరిక. సైబర్ మోసగాళ్ల కొత్త స్కామ్ బయటపడింది. APK యాప్‌ల ద్వారా అధిక వడ్డీ పేరిట వల వేస్తూ సైబర్ నేరాల నుంచి వచ్చిన డబ్బునే యాప్ యూజర్ల ఖాతాల్లోకి పంపుతున్నట్లు CCS పోలీసులు గుర్తించారు. రూ.40 వేలు పెట్టిన యూజర్లకు డబుల్ అమౌంట్ బదిలీ అయ్యింది. చివరకు అది సైబర్ క్రైమ్ మనీ అని తేలింది. ఇల్లీగల్ యాప్‌లు, APK ఫైల్స్ ఇన్‌స్టాల్ చేస్తే మీరు కూడా నేరంలో భాగం అవుతారు. జాగ్రత్త.
SHARE IT

News December 9, 2025

హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

image

హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ​’మీనింగ్‌ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్‌తో మైమరిచిపోతున్నారు. ​ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?

News December 9, 2025

రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య ఒప్పందం

image

రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య అధికారికంగా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీనికి సంబంధించి (MoU)పై ఇరువురు ప్రతినిధులు సంతకం చేశారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బంటియా ఫర్నిచర్స్ మరో మైలురాయిని ప్రకటించడానికి సంతోషంగా ఉందని చెప్పారు. రూ.511 కోట్ల విలువైన ఈ ముఖ్యమైన సహకారం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని గణనీయంగా బలోపేతం చేయనుందని వెల్లడించారు.