News September 7, 2024
BREAKING: HYD: బాలుడి దారుణ హత్య

బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు షాద్నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కట్టప్ప(6) కుమారుడు. ఎల్లయ్య అనే వ్యక్తి రాత్రి దుర్గయ్యకు చెందిన పందులను దొంగిలించేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని బాలుడు కట్టప్ప గమనించడంతో ఎవరికైనా చెబుతాడేమోనని భావించి బాలుడిని బండకేసి బాదడంతో మృతిచెందాడు.
Similar News
News December 1, 2025
HYD: ఆన్లైన్ బెట్టింగ్.. మరో యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్కు చెందిన సాయి (24) శాంతినగర్లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.
News November 30, 2025
హైకోర్టు: 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర జుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్ధతిలో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టు హై కోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ సివిల్ జడ్జిల పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ వివరాలను హై-కోర్టు వెబ్సైట్ http://tshc.gov.comని సంప్రదించవచ్చు.
SHARE IT
News November 30, 2025
HYD: ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు!

ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. HMDA అనుమతులు ఉన్నా సరే.. అవి ‘బిల్డ్ నౌ’ ఆన్లైన్ సైట్లో చూపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి విషయానికి కార్యాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘బిల్డ్ నౌ’ సైట్లో వివరాలు అప్డేట్ కాకపోవడంతో, అందుకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


