News September 7, 2024

BREAKING: HYD: బాలుడి దారుణ హత్య

image

బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు షాద్‌నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కట్టప్ప(6) కుమారుడు. ఎల్లయ్య అనే వ్యక్తి రాత్రి దుర్గయ్యకు చెందిన పందులను దొంగిలించేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని బాలుడు కట్టప్ప గమనించడంతో ఎవరికైనా చెబుతాడేమోనని భావించి బాలుడిని బండకేసి బాదడంతో మృతిచెందాడు.

Similar News

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

image

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: అధిష్టానం చూస్తోంది బాసూ..!

image

ఒక్క హైదరాబాదు వాసులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. అంతేకాదు ఆయా పార్టీల అధిష్ఠానాలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నాయి. ఎలాగైనా గెలిచి ఢిల్లీలో తమ సత్తా ఏంటో చూపించాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరాటపడుతున్నారు. కేటీఆర్ మాత్రం గెలిచి KCRకు ఈ విజయం బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టుకోసం, ఢిల్లీలో పరువు కోసం నాయకులు పాకులాడుతున్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: రోజూ తిట్ల దండకమే!

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. అయితే రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి ఇతర పార్టీలను, నాయకులను విమర్శించడం, తిట్టడమే సరిపోయింది. వారు నియోజకవర్గానికి ఏమి చేస్తారనే విషయం మాత్రం చెప్పడం లేదు. రోజు రోజుకూ తిట్ల దండకం పెరుగుతోందే తప్ప స్థానిక అభివృద్ధిపై కచ్చితంగా ఈ పనులు చేస్తామని హామీలివ్వడం లేదన్న విమర్శలొస్తున్నాయి.