News June 21, 2024
BREAKING: HYD: యువకుడి హత్య
HYDకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాతబస్తీ భవానీ నగర్ PS పరిధిలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని కర్ణాటక పోలీసులు HYDలోని కుటుంబ సభ్యులకు అందించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 8, 2024
HYD: సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలి: సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహణపై సీఎస్ ప్రత్యేకాధికారులతో HYD సచివాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. శాంతికుమారి మాట్లాడుతూ.. ఈ సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈనెల 9 నుంచి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు.
News November 8, 2024
HYDలో కూరగాయల ధరలు తగ్గుతూ వస్తున్నాయి
HYDలో కూరగాయల ధరులు తగ్గుతూవస్తున్నాయి. కూకట్‌పల్లి రైతు బజార్‌లో ధరలు.. నేడు టమాటా కిలో రూ.29 వంకాయ 50, బెండకాయ 45, పచ్చిమిర్చి 40, బీన్స్ 65, దొండకాయ 28, క్యాప్సికం 80, ఆలు 37, క్యారేట్ 65, చిక్కుడు 70, కాకర 38గా ధర పలుకుతుంది. అదేవిధంగా బోయిన్‌పల్లి కూరగాయలు మార్కెట్‌లో కూడా యథావిధిగా ధరలు కొనసాగుతున్నాయి. స్థానిక దుకాణాల్లో వీటికంటే రూ.10 ఎక్కువగా ఉంటుంది.
News November 8, 2024
HYD: యాక్సిడెంట్.. ప్రిన్సిపల్ మృతి
యాక్సిడెంట్‌లో HYD వాసి మృతి చెందారు. మలక్‌పేట అజంతా కాలనీకి చెందిన అర్చన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మం. బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.