News April 14, 2024

BREAKING: HYD: విద్యార్థి SUICIDE

image

నీట్ పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఈరోజు జరిగింది. స్ప్రింగ్ కాలనీలో ఉంటున్న జైస్వాల్(22) నీట్ పరీక్షపై ఆందోళనకు గురై.. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 23, 2024

HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు

image

HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.

News September 23, 2024

HYD: మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు డబుల్

image

HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.

News September 23, 2024

HYD: గీతం యూనివర్సిటీ రూ.1 కోటి విరాళం

image

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ.కోటి విరాళం అందజేశారు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.