News October 4, 2024

BREAKING: HYD: విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

image

మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

Similar News

News November 10, 2024

FLASH: రేపు HYDలో నీళ్లు బంద్

image

రాజధాని వాసులకు ముఖ్య గమనిక. రేపు (నవరంబర్ 11న) నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్‌ పైప్‌‌లైన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట పరిధి ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
SHARE IT

News November 9, 2024

RR: యువత మేలుకో… ఓటరు నమోదు చేసుకో!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు అధికారులు బూత్ స్థాయి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వాళ్లంతా 2024 నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకుఫాం-6,అభ్యంతరాలకు ఫాం-7,సవరణలకు ఫాం-8 నింపాలి.voters.eci.gov.in లేదా voter helpline యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.>>1950(TOLL FREE)

News November 9, 2024

HYD: BRS, BJPపై మంత్రి పొన్నం ఫైర్

image

BRS, BJPపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈరోజు HYD నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KCR, KTR, హరీశ్ రావును అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని గతంలో బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. కానీ తాము చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. BRS, BJP ఒక్కటే అని, కులగణన, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ను హెచ్చరించారు.