News October 4, 2024
BREAKING: HYD: విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి
మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!
Similar News
News November 4, 2024
HYD నగరానికి మెగా మాస్టర్ ప్లాన్-2050
HYD నగర శివారులో రానున్న ఆర్ఆర్ఆర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో మెగా మాస్టర్ ప్లాన్-2050 తయారు చేస్తోంది. దాదాపు 12 వేల చదరపు కిలోమీటర్ల మేర మొబిలిటీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నివాస ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. 2050 నాటికి నగరంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక సైతం తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.
News November 4, 2024
UPDATE.. HYD: వాష్ రూమ్‌లో అత్యాచారం!
వాష్ రూమ్‌కు వెళ్లిన 20 ఏళ్ల యువతిపై మార్ట్ సూపర్‌వైజర్ ఖాజాబషీర్ (35) అత్యాచారం చేసిన దారుణ ఘటన HYD ఘట్కేసర్ పీఎస్ పరిధిలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఈ ఘటన నెల క్రితం జరిగింది. యువతి ఇటీవల కళ్లు తిరిగి పడిపోవడంతో పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు తేలింది. యువతిని నిందితుడు బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News November 4, 2024
HYD: చెరువుల పునరుద్ధరణకు హైడ్రా స్టడీ టూర్..!
చెరువుల పునరుద్ధరణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరుకు స్టడీ టూర్ వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా మరి కొంతమంది ఇందులో పాల్గొననున్నారు. అక్కడచెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో స్టడీ చేస్తారు. ఈ టూర్ అనంతరం ఇక్కడకు వచ్చి బాచుపల్లిలోని ఎర్రకుంటచెరువు, మాదాపూర్ సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువుల పునరుద్ధరణ చేపడతారు.