News July 20, 2024

BREAKING: HYD: సనత్‌నగర్ సీఐపై సీపీ చర్యలు

image

HYD సనత్‌నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో సీఐ అసభ్యకరంగా చాటింగ్ చేశాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలంటూ చాటింగ్ చేశాడని పేర్కొంది. మెసేజ్‌లను చూయించింది. దీంతో సీఐను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 6, 2025

రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

News December 6, 2025

HYD: ఓఆర్ఆర్‌పై ప్రమాదాలు తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ

image

ఓఆర్ఆర్‌పై అతివేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హెచ్ జీసీసీలు సంయుక్తంగా కార్యాచరణ దిగి 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

News December 4, 2025

రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.