News October 13, 2025

BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

image

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 14, 2025

1,968 మంది టెర్రరిస్టులను తరలించాం: ఇజ్రాయెల్

image

గాజా పీస్ ప్లాన్‌లో భాగంగా తమ అధీనంలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదల ప్రక్రియను స్టార్ట్ చేసింది. ‘దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 1,968 మంది టెర్రరిస్టులను ఓఫర్, కట్జియోట్ కేంద్రాలకు తరలించాం. అనుమతుల ప్రక్రియ ముగిశాక వారిని గాజాకు పంపిస్తాం’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

News October 14, 2025

SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

image

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.

News October 14, 2025

ములుగు: పర్యవేక్షణ బాధ్యత పొంగులేటికి సీఎం అప్పగించారు: సీతక్క

image

మేడారం జాతర పనుల పర్యవేక్షణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని సీతక్క అన్నారు. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గద్దెల విస్తరణలో భాగంగా గ్రామస్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని, మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు పూర్తి చేస్తున్నామన్నారు.