News October 5, 2024

BREAKING: HYD: ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ SUSPEND

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 8, 2026

HYD: రేపు జయశంకర్ అగ్రీ వర్సిటీ స్నాతకోత్సవం

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య తెలిపారు. ముడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్నాతకోత్సవాలను ఒకేసారి వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి హాజరుకానున్నట్లు తెలిపారు.

News February 4, 2026

రంగారెడ్డి జిల్లా DEOపై ACBకి ఫిర్యాదు!

image

రంగారెడ్డి జిల్లా DEO సుశీందర్రావు ఆస్తిపాస్తుల, ఆదాయ వ్యయాలపై వెంటనే పూర్తి సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ACBకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలోని అందరూ MEOలు, DEO ఆఫీసులో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న బాదం వెంకటేశ్, లక్ష్మీనరసింహులు ఆస్తులపైనా సమగ్ర విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 4, 2026

మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

image

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.