News September 20, 2025

BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

image

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్‌పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్‌పై దాడికి సిద్ధమవుతుండగా, తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.

Similar News

News September 20, 2025

CAG: రాష్ట్రాల అప్పులు.. రూ.59.6 లక్షల కోట్లు

image

దేశంలోని 28 రాష్ట్రాల అప్పులు పదేళ్లలో మూడింతలు పెరిగాయి. 2013-14లో రూ.17.57 లక్షల కోట్లు ఉండగా 2022-23 వరకు రూ.59.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ మేరకు స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్‌లో కంట్రోలర్&ఆడిటర్ జనరల్(CAG) సంజయ్ వెల్లడించారు. అప్పు, GSDP రేషియో పరంగా పంజాబ్(40.35%), నాగాలాండ్(37.15%), బెంగాల్(33.7%) టాప్‌లో ఉన్నాయి. ఒడిశా(8.45%), MH(14.64%), GT(16.37%) తక్కువ రేషియో నమోదు చేశాయి.

News September 20, 2025

వాల్మీకి మహర్షి విగ్రహం వివాదం.. టీజీ కుటుంబంపై తప్పుడు ప్రచారం: నేతలు

image

అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి టీజీ కుటుంబం పాటుపడుతోందని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు, నాయకులు నంది మధు, దశరథ రామనాథనాయుడు పేర్కొన్నారు. కర్నూలులో ఏ ఘటన జరిగినా మంత్రి టీజీ భరత్ కుటుంబానికి ఆపాదించడం కొందరు అలవాటు చేసుకున్నారని మండిపడ్డారు. వాల్మీకి మహర్షి విగ్రహం తొలగింపు విషయంలో మంత్రి భరత్ ప్రమేయం ఉందంటూ మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు.

News September 20, 2025

హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నీలి నీడలు?

image

హైదరాబాద్ మెట్రో ఏర్పాటుకు రూ.వేల కోట్లు వెచ్చించారు. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇపుడు మెట్రో నిర్వహణే సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో నడపడం కష్టమని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్రో రైలు అసలు తిరుగుతుందా అనే అనుమానాలు నగర వాసికి వస్తున్నాయి.