News November 1, 2025

BREAKING: HYD: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మహిళపై అత్యాచారం

image

HYD అమీర్‌పేట్ పరిధిలో ఈరోజు దారుణం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై GHMC పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Similar News

News November 1, 2025

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌‌లో బాంబు బెదిరింపుల కలకలం

image

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్‌ను ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్‌ను పరిశీలిస్తున్నాయి.

News November 1, 2025

HYD: ‘రంగనాథ్ సార్.. పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం’

image

HYD శంషాబాద్ మండ‌లం చిన్న‌గోల్కొండ‌, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండ‌ర్ పాస్‌లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని విద్యార్థినులు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బ‌స్సులో తాము స్కూల్‌కు వెళ్తామ‌ని.. ఇటీవ‌ల తాము ప్ర‌యాణిస్తున్న బ‌స్సు అండ‌ర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవ‌డంతో ఇబ్బంది ప‌డ్డామ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

News November 1, 2025

HYD: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

image

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివసించే ఓ మహిళ(32) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్‌కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.