News March 31, 2024
BREAKING: HYD: ఫ్రెండ్ ఛాతిలో కత్తితో పొడిచారు..!
HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 13, 2025
ఇంజినీరింగ్ సిలబస్‌లో మార్పులు: బాలకృష్ణా రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్ష మందికిపైగా పట్టభద్రులు బయటకు వస్తున్నారు. వీరిలో పది శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని JNTU ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ సిలబస్‌లో నైపుణ్యాలను పెంచే పాఠ్యాంశాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌ను సమూలంగా మార్చాలంటున్నామని తెలిపారు.
News January 13, 2025
HYDలో విదేశీయులు.. అందు కోసమే..!
HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.
News January 13, 2025
మదాపూర్: శిల్పారామంలో మైమరిపించిన నృత్యం
సంక్రాంతి పండుగ సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ఆదివారం ఆంపి థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కందుల కూచిపూడి నాట్యాలయ గురువు రవి కూచిపూడి శిష్యబృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. కళాకారులు అశ్విక, ప్రియాంక సిరి, ఐశ్వర్య, చైత్ర, సురభి, ఆద్య, కీర్తి, ఇసాన్వి, శ్రావ్య, అరుణ, నిధి, శాన్వి, రిగిష్మ తదితరులు సంగీతాన్ని అనుగుణంగా వేసిన నృత్యం మైమరిపించింది.