News October 30, 2024

BREAKING.. HYD: బస్సు బీభత్సం.. GHMC ఎంప్లాయ్ మృతి

image

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్‌లో ఈరోజు ఉదయం ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొని చౌరస్తా నుంచి సాగర్ హోటల్ వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న హరికృష్ణగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 30, 2024

ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో ఇంటింటికీ సమగ్ర సర్వే నిర్వహించే సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి పథకాన్ని గ్రామం నుంచి పట్టణం వరకు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. జిల్లాకు చెడ్డపేరు తేవొద్దన్నారు.

News October 30, 2024

వారిని కట్టడి చేద్దాం: HYD సీపీ సీవీ ఆనంద్

image

హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని HYD సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం బంజరాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నగర పరిధిలో ఆశ్రయం లేని వ్యక్తుల్లో కొందరికి మానసిక స్థితి సరిగా లేదని, వారు మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్లి దాడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేయాలన్నారు.

News October 29, 2024

HYD: ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నేడు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో పలు పబ్బులపై తాము నిఘా ఉంచినట్లు తెలిపారు. మైనర్లను పబ్బులోకి అనుమతించొద్దని ఆదేశించారు. పబ్బుల దగ్గర 40 శాతం స్థలం ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇకపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.