News October 14, 2025

BREAKING: HYD: మీర్‌పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

image

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News October 14, 2025

సత్యసాయి శతజయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం

image

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23 నుంచి ఘనంగా జరగనున్నాయి. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సత్యసాయి సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రసంశించినట్లు రత్నాకర్ తెలిపారు.

News October 14, 2025

సమాన వేతన హక్కు గురించి తెలుసా?

image

స్త్రీ, పురుషులెవరైనా ఒకే రకం పని చేస్తున్నప్పుడు పొందాల్సిన జీతభత్యాలూ ఇద్దరికీ ఒకేవిధంగా ఉండాలని సమాన వేతన చట్టం-1976 చెబుతోంది. పేమెంట్‌లో వ్యత్యాసం చూపడం చట్టవిరుద్ధం. హైరింగ్‌, ప్రమోషన్‌, ట్రైనింగ్‌లో మహిళలపై వివక్షతను తొలగించడానికి ఈ రూల్‌ తీసుకొచ్చారు. ఒక మహిళ తక్కువ వేతనం అందుతున్నట్లు భావిస్తే, ఆమె ప్రైవేట్/ ప్రభుత్వ రంగం.. ఎందులో పనిచేస్తున్నా చట్టబద్ధంగా సవాలు చేయవచ్చు. <<-se>>#womenlaws<<>>

News October 14, 2025

మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఇదే!

image

మానవ శరీరంలో పెద్దలకు 206, నవజాత శిశువుకు 306 ఎముకలుంటాయి. అలాగే ‘కండరాలు- 639, కిడ్నీలు-2, శిశువు దంతాలు- 20, పెద్దల దంతాలు-32, పక్కటెముకలు-24, అతిపెద్ద ధమని- బృహద్ధమని, సాధారణ రక్తపోటు- 120/80 mm hg, రక్త pH- 7.4, చిన్న కండరం- స్టెపిడియస్(6mm), అతిపెద్ద ఎముక- తొడ ఎముక, అతిపెద్ద అవయవం- చర్మం, అతిపెద్ద గ్రంథి- కాలేయం, కణాల అంచనా సంఖ్య- ~ 30 ట్రిలియన్లు, న్యూరాన్ల సగటు సంఖ్య: ~ 86B’ ఉంటాయి.