News February 4, 2026
BREAKING: HYD: యువ లాయర్ హత్య

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని కేతిపల్లి విలేజ్‌లో పొలం వద్ద ఉన్న యువ న్యాయవాది స్వప్నపై దుండగులు దాడి చేశారు. గొంతు కోసి హత్య చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 4, 2026
కోటప్పకొండపైకి 95 లగ్జరీ బస్సులు: కలెక్టర్

కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులు, VIPల సౌకర్యార్థం కొండపైకి వెళ్లేందుకు 95 ప్రత్యేక లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండపైన, తిరునాళ్లు జరిగే పరిసర ప్రాంతాల్లో 8 ప్రత్యేక 108లను సిద్ధంగా ఉంచామన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అన్ని రకాల మందులు, చికిత్సలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
News February 4, 2026
నల్గొండ: దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. బ్యాంకింగ్, ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఈ కోర్సుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి బి.శశికళ సూచించారు.
News February 4, 2026
నల్గొండ: ఓట్ల లెక్కింపు ఇక్కడే..

నల్గొండ మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ బి.చంద్రశేఖర్ కౌంటింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. నల్గొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు అర్జలబావిలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో జరుగుతుంది. మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీల లెక్కింపును అవంతిపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించనున్నారు. లెక్కింపు సజావుగా సాగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


