News July 5, 2025
BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News July 6, 2025
ప్రజాప్రతినిధుల సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం

TG: స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని అన్ని జిల్లాల CEOలు, DPOలను ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సభ్యుడు, సర్పంచి, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ల కులం, ఉపకులం, పార్టీ తదితర వివరాలను రేపటిలోగా సమర్పించాలని పేర్కొంది. గతేడాది చేపట్టిన సర్వే డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఓ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే వివరాలను సేకరిస్తోంది.
News July 6, 2025
ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
News July 6, 2025
టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.