News October 22, 2025
BREAKING: HYD: సంపులో పడి చిన్నారి మృతి

RR జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్‌లో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్, స్వాతి దంపతులు వారి కుమార్తె రక్షిత(18 నెలలు)ను నానమ్మ దగ్గర వదిలి కూలి పనులకు వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మాణంలో ఉన్న సంపులో పడిపోయింది. చిన్నారి చేతిలో ఉన్న పెన్ను సంపులో కనిపించడంతో లోపలికి చూశారు. చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 22, 2025
ఖమ్మం: ఆ మండలాలకు కేంద్రం రూ.కోటి నజరానా

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా అధిక సోలార్ ప్లాంట్‌లు కలిగిన గ్రామాలను మోడల్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖమ్మం నుంచి 8, భద్రాద్రి జిల్లా నుంచి 14 గ్రామాలు అర్హత సాధించాయి. చివరికి ఉమ్మడి ఖమ్మం నుంచి కొనిజర్ల, భద్రాచలం అధిక మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ముందు భాగాన నిలిచాయి. దీంతో ఆ రెండు మండలాలకు కోటి చొప్పున నజరానాను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.
News October 22, 2025
పాలమూరు: మద్యం షాపు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈసారి 10 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేయగా, గడువు పొడిగించినా ఇప్పటివరకు కేవలం 5,188 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
News October 22, 2025
ADB: పత్తి రైతులకు శుభవార్త

పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పంట విక్రయించే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన 8 శాతంలోపు తేమతో కూడిన పత్తి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర 8110 పొందాలని పేర్కొన్నారు.