News November 22, 2024
BREAKING: భారత్ ఆలౌట్
BGT: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ 150 రన్స్‌కే ఆలౌటైంది. తెలుగు క్రికెటర్ నితీశ్‌రెడ్డి 41 పరుగులతో పోరాడారు. పంత్(37), రాహుల్(26) కుదురుకున్నట్లు కనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ(5), జురెల్(11), సుందర్(4), రాణా(7) బుమ్రా(8) నిరాశపర్చారు. హేజిల్‌వుడ్ 4, స్టార్క్ 2, మార్ష్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు.
Similar News
News November 22, 2024
నాలుగు నెలల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు గత వారంలో ఏకంగా $17.8 బిలియన్ మేర పతనమయ్యాయి. ఈ భారీ తగ్గుదల నేపథ్యంలో నిల్వలు $657.89 బిలియన్లకు చేరుకుని నాలుగు నెలల కనిష్ఠ స్థాయిని తాకాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డాలర్ విలువ క్రమంగా పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువను బలపరిచేందుకు ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ తన నిల్వలను అమ్మకాలకు ఉంచడం ఈ పరిస్థితికి కారణమైంది.
News November 22, 2024
ఇది కదా భారత్ దెబ్బ.. లెంపలేసుకున్న ఆసీస్ ఆర్మీ
ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ట్విటర్ ఖాతా ‘ఆసీస్ ఆర్మీ’ అత్యుత్సాహం చూపించింది. భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటయ్యాక పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న అర్థం వచ్చేలా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మరింత ఘోరంగా 67 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయాక లెంపలేసుకుంది. భారత బౌలర్లు చాలా టాలెంటెడ్ అంటూ కొనియాడింది. ఇంకెప్పుడూ మా టీమ్‌ను తక్కువ అంచనా వేయొద్దంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఆసీస్‌ను ట్రోల్ చేస్తున్నారు.
News November 22, 2024
డిగ్రీ లేని గవర్నమెంట్ డాక్టర్.. 44 కంటి ఆపరేషన్లు
హరియాణాలో విజయ్ అనే డాక్టర్ పట్టా అందుకోకుండానే 44 కంటి ఆపరేషన్లు చేశారు. ఏడాదికి 1000 కంటి ఆపరేషన్లు చేసే హిసార్ సివిల్ హాస్పిటల్లో వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో సర్జన్ల కొరత పూడ్చేందుకు PG పూర్తి కాకుండానే విజయ్‌ని హెల్త్ డిపార్ట్మెంట్ ఆ హాస్పిటల్లో హడావుడిగా నియమించింది. విషయం తెలుసుకున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అతడిని విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.