News January 5, 2025
భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా జడేజా(13), సుందర్(12), సిరాజ్(4), బుమ్రా(0) వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లతో చెలరేగారు. కమిన్స్ 3 వికెట్లు తీశారు. AUS గెలవాలంటే 162 రన్స్ కావాలి.
Similar News
News December 28, 2025
TG: ఈ ఆలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి వేడుకలు భద్రాచలంతో పాటు యాదగిరిగుట్ట, ధర్మపురి, హైదరాబాద్ TTD క్షేత్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. స్వర్ణగిరి వేంకటేశ్వర, చిలుకూరు బాలాజీ ఆలయాల్లో గతంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించారు. శివాలయమే అయినా అనంత పద్మనాభ స్వామి కొలువైనందుకు వేములవాడలోనూ ఉత్తర ద్వార దర్శనాలుంటాయి. స్థానిక వైష్ణవాలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.
News December 28, 2025
నేడు నాలుగో టీ20.. భారత్‌కు ఎదురుందా?

శ్రీలంక, భారత మహిళా జట్ల మధ్య ఇవాళ నాలుగో T20 జరగనుంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలిచి 5 T20ల సిరీస్‌ను టీమ్ఇండియా చేజిక్కించుకుంది. మిగతా 2 మ్యాచుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. కనీస పోటీ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. 7PM నుంచి స్టార్ స్పోర్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
News December 28, 2025
తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను TTD ప్రారంభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి Jan 7 వరకు SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరు. ఈనెల 30, 31, Jan 1 తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని Jan 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్‌లో అనుమతిస్తారు.


