News October 17, 2024

46 పరుగులకే భారత్ ఆలౌట్

image

NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.

Similar News

News October 17, 2024

షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ

image

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. NOV 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ఆ దేశంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె బంగ్లాను వీడిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఆమె భారత్ చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

News October 17, 2024

ఇండియా నుంచి ఒకే ఒక్కడు!

image

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ యాక్టర్‌గా నిలిచారు. లండన్‌లోని ఫేషియల్ కాస్మొటిక్ సర్జన్ డా. జూలియన్ డి సిల్వా గోల్డెన్ రేషియో కాన్సెప్ట్‌తో ప్రపంచంలోని హ్యాండ్సమ్ నటుల జాబితాను రూపొందించారు. అందులో ఏకైక భారతీయ నటుడు షారూఖ్ ఖాన్(86.76%) పదవ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్ యాక్టర్ ఆరోన్ టేలర్ జాన్సన్ (93.04%)తో ప్రథమ స్థానంలో, లూసీన్ లావిస్‌కౌంట్ (92.41%) రెండో స్థానంలో ఉన్నారు.

News October 17, 2024

పుజారా సేవల్ని భారత్ మిస్ అయింది: కుంబ్లే

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా పూజారా సేవల్ని మిస్ అయిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. చుట్టూ వికెట్లు పడుతున్నా పుజారా గౌరవప్రదమైన స్కోరును జట్టుకు అందించేవారని పేర్కొన్నారు. ‘100 మ్యాచులాడిన అలాంటి ఆటగాడి సేవల్ని భారత్ మిస్ అయింది. అతడైతే బంతిని కొట్టేందుకు వెళ్లకుండా బ్యాట్ మీదకు వచ్చేవరకూ వేచి చూసేవారు. విరాట్ 4వ స్థానంలోనే ఆడాల్సింది’ అని పేర్కొన్నారు.