News December 30, 2024

టీమ్ ఇండియా ఓటమి

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 184 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్సులో ఓపెనర్ జైస్వాల్(84), పంత్(30) మినహా మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. AUS బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3, లయన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.

Similar News

News October 19, 2025

దీపావళికి ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోండి

image

దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున మీ ఇల్లు దేదీప్యమానంగా మెరిసిపోయేందుకు LED లైట్లతో అలంకరించుకోవచ్చు. దీపాలను ఒక వరుసలో పెట్టడం కంటే దియా స్టాండ్లను వాడితే మంచి లుక్ వస్తుంది. గుమ్మానికి పూల తోరణాలతో పాటు హ్యాంగింగ్స్ వేలాడదీయాలి. ఇంటి ఆవరణలో చిన్నమొక్కలు ఉంటే వాటికి లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పూలరంగోళీలు పండుగ శోభను మరింత పెంచుతాయి. పేపర్ లాంతర్లలో లైట్లను వేలాడదీస్తే ఇంకా బావుంటుంది.

News October 19, 2025

16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.

News October 19, 2025

దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం

image

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దైవస్వరూపమైన జ్యోతి అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగునిస్తుంది. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాం. ఎవరి ఇంట అయితే దీపాలెప్పుడూ వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు. వారి కార్యాలన్నీ సుగమం అవుతాయి.
* రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.