News September 14, 2025
BREAKING: భారత్ ఓటమి

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.
Similar News
News September 15, 2025
నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్ విషయంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘నాకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా ఆదాయం పుష్కలంగా ఉంది. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు. నాకు దిగజారే అవసరం లేదు’ అని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.
News September 14, 2025
2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్లు ఔటయ్యారు. గిల్ 10 రన్స్ చేసి స్టంపౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో రఫ్పాడించారు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 42/2గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 86 పరుగులు అవసరం.
News September 14, 2025
భారత్-పాక్ మ్యాచ్: షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు

ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. టాస్ సమయంలో కనీసం పలకరించుకోకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని ఇండియన్ ఫ్యాన్స్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.