News January 3, 2025

BREAKING: కష్టాల్లో భారత్

image

ఆసీస్‌తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు మూడు వికెట్లు పడగా, ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లీ(17) స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని అనవసర షాట్‌కు యత్నించి విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(9), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.

Similar News

News November 13, 2025

‘ఉగ్ర’వర్సిటీ.. పేలుళ్లకు పథక రచన అక్కడే!

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్‌ అల్ ఫలాహ్ వర్సిటీ వార్తల్లో నిలిచింది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే డా.ఉమర్ నబీ, ముజమ్మిల్ పథకం రచించారు. వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌తో సంప్రదింపులు జరిపారు. 4 నగరాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు. కానీ ఫండ్ రైజ్ డబ్బుల విషయంలో ఉమర్, ముజమ్మిల్‌ మధ్య విభేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్లు జరగలేదు. లేదంటే మరింత మంది బలయ్యేవారేమో!

News November 13, 2025

తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం

image

దేశీయ మంచి నీటి చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం తెలంగాణలోని రంగారెడ్డి(D) కోహెడలో 13ఎకరాలను ఎంపిక చేసింది. దీని ఏర్పాటుకు రూ.47 కోట్లను మంజూరు చేసింది. దేశంలోని జలాశయాలు, డ్యాములు, చెరువులు, కుంటల్లో చేపలను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

News November 13, 2025

తెలుగు రాష్ట్రాల మత్స్యకారులకు ప్రయోజనం

image

మంచినీటిలో చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అమలులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 2024లో మంచినీటి చేపల ఉత్పత్తి 4.39 లక్షల టన్నులు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులుగా ఉంది. అందుకే ఈ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణను కేంద్రం ఎంపిక చేసింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల మత్స్యకారులు, వ్యాపారులకు లబ్ధి కలగడంతో పాటు 5వేల మందికి ఉపాధి లభిస్తుంది.