News August 7, 2024
BREAKING: సెమీఫైనల్లో భారత్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో మెన్స్ హాకీ సెమీఫైనల్లో భారత జట్టు పరాజయం పాలైంది. జర్మనీతో హోరాహోరీగా జరిగిన మ్యాచులో 3-2 తేడాతో ఓడిపోయింది. దీంతో హాకీలో భారత్ ‘బంగారు’ ఆశలు ఆవిరయ్యాయి. రేపు జరిగే కాంస్య పోరులో భారత జట్టు స్పెయిన్‌తో తలపడనుంది. అదే రోజు నెదర్లాండ్స్‌తో జర్మనీ ఫైనల్ ఆడనుంది.
Similar News
News February 11, 2026
విద్యుత్ శాఖలో అతిత్వరలో నియామకాలు: గొట్టిపాటి

AP: విద్యుత్ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు అతి త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లలో 90 శాతానికి పైగా పరిష్కరించామన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయులు పెరిగేలా విధులు నిర్వర్తించాలని బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో తెలిపారు. మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి సమస్యలుంటే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
News February 11, 2026
ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.
News February 11, 2026
‘మైసూర్ సోప్’ అంబాసిడర్‌గా తమన్నానే ఎందుకు?

తమన్నాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో <<19102536>>దుమారం<<>> రేగిన విషయం తెలిసిందే. అయితే నార్త్, సౌత్‌లో పాపులర్ ఫ్యాక్టర్, ప్రస్తుతం ఆమె ఎలాంటి బ్యూటీ సబ్బులను ప్రమోట్ చేయకపోవడం, SM ఫాలోవర్లు, పాన్ ఇండియా అప్పియరెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంశాలు కారణాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ చెబుతోంది. దీపిక, రష్మిక, కియారా, పూజా హెగ్డేను వెనక్కి నెట్టి తమన్నా ఈ ఆఫర్ కొట్టేశారు.


