News February 6, 2025

BREAKING: భారత్ విజయం

image

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.

Similar News

News November 27, 2025

MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

image

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

News November 27, 2025

ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.

News November 27, 2025

రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే మృతి

image

రష్యాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ ద్వారా మొదట బరువు పెరిగి తర్వాత తగ్గే ప్రోగ్రామ్‌ను ప్రయత్నిస్తూ ఫిట్‌నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్(30) చనిపోయారు. ఆయన రోజుకు 10వేల క్యాలరీలకుపైగా జంక్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. డిమిత్రి ప్రయత్నం వికటించి ఒక నెలలోనే 13KGలు పెరిగి 103KGలకు చేరారు. చివరికి గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఇలాంటి ఛాలెంజ్‌లను ఎవరూ అనుసరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.