News November 14, 2024
BREAKING: ఉత్కంఠ పోరులో భారత్ విజయం
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 219/6 స్కోర్ చేయగా ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7 చేసింది. దీంతో భారత్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీ(107)తో రాణించారు. కాగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.
Similar News
News November 14, 2024
Stock Market: 7% పెరిగిన ఐషర్ మోటార్స్
Q2 ఫలితాలు 8%(YoY) అధికంగా రాబట్టడంతో రాయల్ ఎన్ఫీల్డ్ పేరెంట్ సంస్థ ఐషర్ మోటార్స్ షేరు గురువారం సెషన్లో 7% వరకు పెరిగింది. Hero Motoco 2%, Grasim 1.24%, Kotak Bank 1.23%, Hdfc Life 1.20% లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. HindUnilvr 2.92%, BPCL 2.50%, Britannia 2.47%, Tata Consum 2.35%, Nestle Ind 2.11% నష్టపోయి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మీడియా, బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ రంగ షేర్లు లాభపడ్డాయి.
News November 14, 2024
WOW: ఇది ప్రభుత్వ పాఠశాలే..!
దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను సీఎం ఆతిశీ ఇవాళ ప్రారంభించారు. సుందరి నగర్లో ఈ స్కూల్‌ను సరికొత్త హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. మూడంతస్తుల్లో 131 గదులు, 7 ల్యాబ్‌లు, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, యోగా రూమ్, లిఫ్ట్, టాయిలెట్ల బ్లాక్ తదితర సౌకర్యాలతో నిర్మించారు. ఇందులో దాదాపు 7 వేల మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కూల్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
News November 14, 2024
కేటీఆర్ గురించి నేనేం చెప్పలేదు: పట్నం నరేందర్ రెడ్డి
TG: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని BRS మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి లేఖ రాశారు. ఆ రిపోర్టులో ఏముందో కూడా తనకు తెలియదన్నారు. ‘లగచర్ల కేసు, KTR గురించి నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదు. నా అడ్వకేట్ అడిగితే ఈ రిపోర్టును ఇచ్చారు. దీనితో నాకేం సంబంధం లేదు’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా వికారాబాద్ కోర్టులో నరేందర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.