News July 28, 2024
BREAKING: భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

రెండో టీ20లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత లంక 161/9 స్కోర్ చేయగా, ఛేజింగ్‌లో 3 బంతులు పడగానే వర్షం మొదలైంది. ఆ తర్వాత భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లలో 78 రన్స్‌గా అంపైర్లు నిర్దేశించారు. ఆ టార్గెట్‌ను బ్యాటర్లు 6.3 ఓవర్లలోనే ఛేదించారు. జైస్వాల్ 30, సూర్య 26, హార్దిక్ 22 పరుగులతో రాణించారు.
Similar News
News December 1, 2025
సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

హీరోయిన్ సమంత రెండో వివాహంపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీనమైన, నిరాశయులైన పురుషులను డబ్బుతో కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పీఆర్ గొప్పవారిగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సమంత వివాహంపై చేసిన ఈ వ్యాఖ్యలు SMను ఊపేస్తున్నాయి.
News December 1, 2025
CSIR-IHBTలో ఉద్యోగాలు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News December 1, 2025
AP న్యూస్ రౌండప్

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆలయాల్లో రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి


