News September 15, 2025

BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

image

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.

Similar News

News September 15, 2025

‘మిరాయ్’ మూవీని వదులుకున్న నాని!

image

తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీని తొలుత నేచురల్ స్టార్ నానికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వినిపించారని తెలుస్తోంది. ‘కథ విన్న వెంటనే నాని ఒప్పుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడంతో ఆయన ఈ మూవీని వదులుకున్నారు’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత తేజాకు ఈ కథ చెప్పగా.. వెంటనే ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది.

News September 15, 2025

భారత్‌కు ఇబ్బందులు తప్పవు: US మంత్రి

image

ఏకపక్షంగా వెళ్తే భారత్‌కు వాణిజ్యం విషయంలో కష్టాలు తప్పవని US మంత్రి హోవార్డ్ లుట్నిక్ నోరు పారేసుకున్నారు. ‘భారత్ 140 కోట్లమంది జనాభా ఉందని గొప్పలు చెప్పుకుంటుంది. మరి మా మొక్కజొన్నలు ఎందుకు కొనరు? భారత్-US సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. విక్రయాలతో ప్రయోజనాలు పొందుతారు. మమ్మల్ని మాత్రం అడ్డుకుంటారు. మేము ఏళ్ల తరబడి తప్పు చేశాం. అందుకే ఇప్పుడు సుంకాల రూపంలో చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.

News September 15, 2025

సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు

image

1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య(ఫొటోలో) జననం
1892: గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
*జాతీయ ఇంజినీర్ల దినోత్సవం
*అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం