News December 16, 2024
BREAKING: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి FEB 22 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది.
Similar News
News December 17, 2025
జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.
News December 17, 2025
కొండెక్కిన వెండి ధరలు

వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.11వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ రేట్ రూ.2,22,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,34,510గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరిగి రూ.1,23,300కు చేరింది.
News December 17, 2025
RBI 93 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 93 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్డీ, సీఏ, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://rbi.org.in/


