News June 26, 2024

BREAKING: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

AP: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్‌లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1 నుంచి వెబ్‌సైటులో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది. WAY2NEWS యాప్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

Similar News

News December 4, 2025

APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<>BEML<<>>) 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 42, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 45ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.bemlindia.in.

News December 4, 2025

‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

image

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్‌గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.

News December 4, 2025

రూపాయి మరింత పతనం

image

రూపాయి నేలచూపులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి రికార్డు కనిష్ఠ స్థాయిని తాకింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90.43కి పడిపోయింది. నిన్న 90.19 వద్ద ముగిసింది. భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్ విలువ పెరిగి రూపాయి కిందికి పడుతోంది. ఏడాదిలో 85 నుంచి 90కి పడిపోయిందని, ఇది అత్యంత వేగవంతమైన క్షీణత అని ఎస్‌బీఐ తెలిపింది.