News June 23, 2024

BREAKING: రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

image

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు రిజల్ట్స్ రిలీజ్ చేయనుంది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ <>results.cgg.gov.in<<>>తో పాటు అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWS యాప్‌లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు.
* SHARE IT

Similar News

News January 13, 2025

ఆన్‌లైన్‌లో ‘డాకు మహారాజ్’ HD ప్రింట్!

image

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో HD ప్రింట్ రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇటీవల రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ మూవీని కూడా విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో పెట్టేశారు. అంతేకాకుండా బస్సులో సినిమాను ప్రదర్శించిన వీడియో సైతం వైరల్ అయింది. ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారని, పైరసీని ఆపాలని పలువురు సినీ పరిశ్రమ అభిమానులు కోరుతున్నారు.

News January 13, 2025

హిస్టరీలో ఫస్ట్‌టైమ్: 23 పైసలు తగ్గి 86.27కు రూపాయి

image

డాలర్ పంచ్‌లకు రూపాయి విలవిల్లాడుతోంది. సోమవారం ఓపెనింగ్ ట్రేడ్‌లో సరికొత్త జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఏకంగా 23 పైసలు బలహీనపడి చరిత్రలో తొలిసారి 86.27కు చేరుకుంది. డాలరుతో పోలిస్తే శుక్రవారం 14 పైసలు తగ్గి 86 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఏదో చేస్తాడన్న విశ్వాసం, డాలర్ ఇండెక్స్, ట్రెజరీ, బాండ్ యీల్డుల పెరుగుదల, FIIలు వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.

News January 13, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

భోగి పండగ వేళ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.430 పెరిగి రూ.80,070 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,400కు చేరింది. అటు కేజీ వెండి రూ.1,000 పెరిగి రూ.1,02,000 పలుకుతోంది.